5D మీడియా: WHO హెచ్చరికలు, వివిధ దేశాల అధ్యక్షుల ప్రకటనలు చూస్తుంటే CORONA 3rd WAVE ముప్పు మన దేశానికి కూడా పొంచి ఉందని చెప్పొచ్చు. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రజలకు స్వీయ రక్షణ ఒకటే మార్గం. సామాజిక దూరం(SOCIAL DISTANCE) పాటించటం,(MASK)మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం (SANITZE) చేసుకోవడం మొదలగు జాగ్రత్తలు పాటించడం వలన మనము CORONA నుంచి తప్పించుకోవచ్చు. మెక్సికోలో ఇప్పటికే CORONA 3rd WAVE మొదలైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. మెక్సికోలో CORONA 3rd WAVE ఆగస్టులో గరిష్ఠ స్థాయిని తాకుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మానుయేల్ లోపేజ్ కూడా ఈ విషయంపై స్పందించారు. దీని ప్రభావం యువకులపై అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మనదేశంలోను మరియు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రాజకీయ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రజలు అధికంగా పాల్గొంటున్నారు. ఇది ఖచ్చితంగా 3rd WAVE ముప్పు పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనదేశంలో CORONA ఆంక్షలు పూర్తిగా ఎత్తి వేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ జనసందోహం ఎక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు చేయవలసింది ఎవరికి వారే స్వీయరక్షణ పాటించాలి. 3rd WAVE ముప్పు పొంచి ఉందనేది వాస్తవం. కానీ అది ఏ స్థాయిలో ఉంటుందనేది అంచనా వేయలేము. CORONA మొదటి దశ కంటే రెండో దశ చాలా ప్రమాదకరంగా మారింది. అలాగే మూడో దశ విషయంలో కూడా నిపుణుల అంచనాలు ఎలా ఉంటాయన్నది పక్కనపెట్టి ప్రజలు ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ప్రధానంగా జన సమూహాలకు దూరంగా ఉండాలి. CORONA శోకడానికి ప్రధాన కారణం ప్రజలు ఎక్కువగా గుమికూడటం. ప్రధానంగా ప్రజలు చేయవలసింది రక్షణ మార్గాలు పాటించటం మాత్రమే.

CORONA
CORONA